భారత రాజ్యాంగ రూపశిల్పి డా. భీమ్‌రావ్ అంబేద్కర్‌ను గౌరవించే ప్రయత్నంలో, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్ల నుండి ఐదుగురు మహిళలతో సహా 150 మందికి పైగా ఖైదీలను విడుదల చేసింది.శుక్రవారం విడుదలైన ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు మరియు హత్య వంటి నేరాలకు జీవిత ఖైదు అనుభవిస్తూ కనీసం 14 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసినవారు. దేశద్రోహం, అత్యాచారం, పోక్సో చట్టం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు లావాదేవీల కింద శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయలేదు.డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖైదీలను విడుదల చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం (GAD) గత ఏడాది ఏర్పాటు చేసిన కమిటీ తీసుకున్నది, దానిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. కమిటీ సిఫారసుల మేరకు గాంధీ జయంతి సందర్భంగా కూడా ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.