ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి మరో షాక్ తగిలింది. తాజాగా గోవాలోని పెర్నామ్ జిల్లా పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. గోవాలో 2022 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజా ఆస్తులపై అక్రమంగా పోస్టర్లు అతికించినందుకు ఆప్‌పై కేసు నమోదైంది. ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు పేర్ణం పోలీసులు సమన్లు జారీ చేశారు.