విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలన్న కోరిక సీఎం జగన్మోహన్‌రెడ్డికి లేదని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ‘‘లోక్‌సభ, రాజ్యసభలో కలిపి వైిసీపీకి పాతిక మందికి పైగా ఎంపీలున్నారు. ఒక్కసారి కూడా ఈ ఎంపీలు ఢిల్లీలో విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం వద్ద గట్టిగా పోరాడింది లేదు. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని చూసి ఈయన సిగ్గు తెచ్చుకోవాలి. పోరాడే శక్తి లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి దిగిపోవాలి’’ అని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa