టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సోమవారం ఉదయం కర్నూలు జిల్లా, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇవాళ ఎన్కే కొట్టాల క్యాంప్ సైట్ నుంచి యాత్ర ప్రారంభమైంది. గుండ్లకొండ, గుడిమిర్ల, బుర్రుకుంటలో లోకేష్ స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ... వైకాపా పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రక్షాళన చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని ఇందులో సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు.