సాధారణంగా పిల్లలు పాఠశాలకు వెళ్లమని మారాం చేస్తే తల్లిదండ్రులు వారికి ఇష్టమైన బొమ్మలు, చాక్లెట్స్ కొనిస్తామని పంపిస్తారు. కానీ మలేషియాకు చెందిన పారిశ్రామిక వేత్త ఫర్హానా జహ్రా 5ఏళ్ల కూతురు ఫాతిమాకు ఖరీదైన కారును ఇచ్చారు. స్కూల్ వెళ్లనని చెబితే బర్త్ డేకు ఏం గిఫ్ట్ కావాలని అడగ్గా BMW లేదా Mercedes G Wagon కావాలని కోరిందని, దీంతో రూ.3 కోట్లకుపైగా విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ కారును ఇచ్చామన్నారు.