మొబైల్ ప్రస్తుతం మానవ జీవతంలో భాగమై పోయింది. అయితే ఫోన్‌ను ఎక్కువగా చూడటం వల్ల, ఎక్కువసేపు మాట్లాడటం వల్ల జుట్టు రాలిపోతుందట. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, ఇతర స్క్రీన్లు ఎక్కువసేపు చూస్తూ ఉంటే.. కొంత కాలానికి తలపై వెంట్రుకలు రాలిపోవడం ప్రారంభమవుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇక ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని గంటల తరబడి మాట్లాడటంతో వెలువడే రేడియేషన్స్ ఎఫెక్ట్‌తో కూడా జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది.