విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కొర్పొరేట్లకు కట్ట బెడితే బిజెపికి పుట్టగతుల ఉండవని ఎఐటియుసి రాష్ట్ర నాయకులు పి. నాగాంజనేయులు అన్నారు. ఎఐటియుసి రాష్ట్ర సమితి పిలుపు మేరకు రేపల్లె పట్టణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా స్దానిక బస్టాండ్ సెంటర్ లో నిరసన తెలియజేస్తూ దిష్టి బొమ్మను దగ్దం చేయచుండగా రేపల్లె ఎస్. ఐ రజాక్ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళారు.