ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడిరోడ్డుపై బాలికను కాల్చిచంపారు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 17, 2023, 03:41 PM

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. జలౌన్ జిల్లాలోని కోట్రాలో ఓ విద్యార్థినిని నడిరోడ్డుపై కాల్చిచంపారు. బాలిక కాలేజీకి వెళ్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు పట్టపగలు అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం నిందితులు అక్కడినుండి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa