జగ్గయ్యపేట పట్టణం స్థానిక ప్రభుత్వ హాస్పటల్ నందు బాల సైదా సేవా సమితి వారి ఆధ్వర్యంలో అగ్రహారం గ్రామానికి చెందిన డ్రిల్లింగ్ ఖాజా ఏర్పాటు చేసిన జగ్గయ్యపేట లోకల్ ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ అత్యవసర సమయంలో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో డ్రిల్లింగ్ ఖాజా ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ప్రభుత్వాలతో పాటుగా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావడం శుభపరిణామమని తెలిపారు.