గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి, భక్తులకు సౌకర్యాలు ఏర్పాటుకు సహకారం అందించాలని ఆలయ అధికారులు, సిబ్బంది దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణను కలసి విజ్ఞప్తి చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతలు సేకరించడంతో సోమవారం కసాపురం ఆలయ అధికారులు, సిబ్బంది అమరావతి వెళ్లి ఆయనను మర్యాద పూర్వకం గా కలుసుకుని అర్చకులు సత్క రించి ఆశీర్వచనాలు చేసి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. అనంతపురం జిల్లా కలెక్టరుగా, సంయుక్త కలెక్టరుగా ఉన్న సమ యంలో పలుమార్లు ఆలయాన్ని సందర్శించినట్లు గుర్తు చేశారు. ఆలయ విస్తరణ, అభివృద్ధికి చెందిన బృహత్తర ప్రణాళికను ఆలయ ఈఓ వేంకటేశ్వర రెడ్డి కమిషనర్ కు వివరించారు. ఆయనను కలిసిన వారిలో ఆలయ పర్యవేక్షకుడు రామ్మోహన్ రావు, సీనియర్ సహాయ కుడు వేమన్న, ప్రధాన అర్చకులు గరుడాచార్యులు తదితరులు పాల్గొన్నారు.