ఏపీలో పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. అయితే ఈ నెల 19 నుంచి స్పాట్ వాల్యుయేషన్ మొదలవుతున్న నేపథ్యంలో పేపర్ వ్యాలువేషన్ కోసం టీచర్లకు విధులు అప్పగిస్తున్నారు. అయితే తెనాలిలోని NSSM హైస్కూల్ టీచర్ గుడ్డేటి నాగయ్య ఆరు నెలల క్రితమే కన్నుమూశారు. ఈ విషయం పరిగణనలోకి తీసుకోకుండా గుంటూరు DEO చనిపోయిన టీచర్‌కు కూడా వాల్యుయేషన్ డ్యూటీ వేసింది. ఆ ఆర్డర్ కాపీ స్కూలుకు చేరడంతో టీచర్లంతా విస్తుపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa