తమిళనాడు కోయంబత్తూరులోని ఓ స్కూల్ లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గోడలు, గేట్ ధ్వంసం చేశాయి. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనతో స్కూల్ విద్యార్ధులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఐదు గంటల సమయంలో స్కూల్ గేట్ ను తోసుకుంటూ వచ్చిన ఏనుగుల గుంపు, చుట్టు పక్కల ఉన్న గోడలను ధ్వంసం చేశాయి. అయితే ఏనుగులను చూడగానే విద్యార్ధులు, సిబ్బంది గదుల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa