జియమ్మవలస మండలం బిత్రపాడు పంచాయతీలో మంగళవారం డాక్టర్ సౌమిని సుప్రియ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది 104 వైద్య సేవలు అందించారు. గ్రామాల్లో జ్వర పీడితులను పరీక్షించి మందులు పంపిణి చేసారు. దీర్ఘ కాళికా వ్యాధులతో బాధపడుతున్న రోగుల ఇంటికి వెళ్లి పరీక్షించి మందులు అందించారు. వైద్య సిబ్బంది దుర్గ భావాని, లీలావతి, సత్యారావు, జగదీష్ పాల్గొని సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు