మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం దాదాపు 8 గంటలపాటు ఆయన్ను విచారించిన సీబీఐ అధికారులు ఇవాళ మరోసారి విచారణకు రావాలని సూచించారు. దీంతో నేడు ఉదయం 10:30 గంటలకు అవినాష్ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్‌రెడ్డి ఈనెల 25 వరకు ప్రతిరోజు సీబీఐ విచారణకు వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa