అచ్యుతాపురం: ఎస్ ఈ జడ్ నిర్వాసితులు సమస్యలు పరిష్కరించాలని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాద్ కు వినతిపత్రం అందచేశారు. అనంతరం సెజ్ నిర్వాసితులు స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలని రసూల్ డెక్కర్ ప్లేవుడ్ పరిశ్రమలో నిర్యాసితులు, ముఠా కార్మికులకు పాత పద్ధతులో పనులు కల్పించి న్యాయం చేయాలనిగురువారం పరిశ్రమల శాఖ గుడివాడ అమర్నాధ్ ను కోరారు. మంత్రి వెంటనే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కు ఫోన్ చేసి పాత విధానంతో పనులు కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము మాట్లాడుతూ ఎస్ ఈ జెడ్ పరిశ్రమలకు అతి తక్కువ ధరకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమ యజమానులపై ఉందని పరిశ్రమలలో ఉపాధి కల్పించకపోతే భూములు కోల్పోయిన నిర్వాస్తులు ఏం తిని బతకాలని నిర్వసితులు కోరారు. ఇప్పటికైనా ట్రైనింగ్ సెంటర్ పెట్టి నిర్వాసితులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలోఎంపీటీసీ ద్వారపురెడ్డి బాబ్జి దొప్పర్ల సర్పంచ్ కొరుప్రోలు చిన్నారావు, సత్యం, ముఠా కార్మికులు నానాజీ సత్తిబాబు, సూరిబాబు, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.