నగర పోలీస్ కమిషనర్ సి. యం త్రివిక్రమ వర్మ, ఆదేశాలతో నగర పోలీసు అధికారులు సిబ్బంది గురువారం ఇసుక, మద్యం, ఎన్ డి పి ఎస్ కేసులు పేకాట టౌన్ న్యూసెన్స్ కేసులు బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు కమిషనరేట్ అదికారులు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
నగరం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో లా అండ్ ఆర్డర్ క్రైమ్ బీట్స్ మొబైల్స్ తో గస్తీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేసారు. నగరంలో పలు ప్రాంతాలలో 48 మందిపై టౌన్ న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు. పోలీసులు, సెబ్ అధికారులు గంజాయి, డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాల దుష్పరినామాలపై అవగాహన తరగతులు నిర్వహించారు. అనుమానిత ప్రదేశాలను, పార్సెల్ గోడౌన్లను షాపులను తనిఖీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన 48 మందిపై కేసులు నమోదు చేశారు.
నగరంలో డ్రింక్ అండ్ డ్రైవ్ నందు 46 కేసులు నమోదు చేయడంతో పాటుగా ఎం. వి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1884 కేసులు నమోదు చేశారు. ఆటో వయోలెషన్ కేసులు 196 ఆర్టీసీ వయోలెషన్ 2 నమోదు చేశారు. నగరంలోని ప్రజలకు దిశా ఎస్ ఓ ఎస్ యాప్ పట్ల అవగాహన కల్పించి, 95 మందితో యాప్ డౌన్లోడ్ చేయించారు. మహిళా పోలీసులు తమ పరిధిలోని సైబర్ క్రైమ్స్, లోన్ యాప్స్, ఓటిపి ఫ్రాడ్స్ తక్కువ వడ్డీకి సులభతరమైన లోన్లు ఇస్తామని చెప్పి జరిగే మోసాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.