వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ ఆయన అప్పటివరకు ప్రతిరోజు విచారణకు హాజరు కావాలని తెలియజేసింది. కాగా.. అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ను సుప్రీం విచారణకు స్వీకరించింది. ఈ రోజు సీజేఐ ధర్మాసనం ముందు సునీత పిటిషన్ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. రేపు విచారణకు స్వీకరిస్తామని సీజేఐ తెలిపారు. దీంతో రేపు సునీత పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.