ఉత్తరప్రదేశ్లో అమానవీయ ఘటన జరిగింది. కౌధియారాలోని సెహ్రా గ్రామంలో ఛోటూ అనే వ్యక్తికి భార్యతో మనస్పర్దలు వచ్చాయి. ఈక్రమంలో భార్యతో గొడవ పడిన అతడు కుటుంబీకులను బయట ఉంచి తలుపుకు గడియపెట్టాడు. అనంతరం ఏడాది వయసున్న తన కుమారుడికి చీరతో ఉరి వేయబోయాడు. తల్లి హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి బాలుడిని లాక్కుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఛోటూను స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు.