ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు. స్పష్టం చేశారు. గురువారం పెందుర్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ. చంద్రబాబు 73 సంవత్సరాల వయసులో అలుపెరగకుండా అధికార పార్టీని ముచ్చమటలు పట్టిస్తున్నారన్నారు. 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిన తర్వాత రక్తాన్న కడిగి, కుట్లు వేసిన వ్యక్తి ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డిచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.