ఉరవకొండ పట్టణంలో 600 మంది ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు కోర్టు కేసుల కారణంగా స్థలాలు పంపిణీ చేయలేకపోయామని దాన్ని వెంటనే పరిష్కరించి పేదలకు ఇళ్ల స్థలాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ గౌతమిని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కోరారు. ఉరవకొండ నియోజకవర్గంలో నెలకొన్న, పెండింగులో ఉన్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమిని కోరారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ఆమెను కలిసిన మాజీ ఎమ్మెల్యే పలు అంశాలపై అరగంటకు పైగా చర్చించారు. అందుకు సంబంధించిన వినతిపత్రాలు అందించారు. ప్రధానంగా మండలంలోని హెచ్చెల్సీ నుండి పిఎబిఆర్ కు వెళ్లే లింక్ కెనాల్ శిథిలావస్థకు చేరుకున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే శాశ్వత ప్రాతిపదికన లింక్ కెనాల్ కు ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరారు.