విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ప్రభుత్వం నోటిఫైడ్ ఏరియా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి గెజిట్ జారీ అయింది. కమిటీ మూడేళ్లపాటు ఉంటుంది. ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ అధ్యక్షతన వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ స్పెషల్ సీఎస్, ఏపీ ఎయిర్స్పోర్ట్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఎండీ సహా 8మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విధులు, అధికారులను సూచిస్తూ మరో గెజిట్ జారీ అయింది.