గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతిక్ మహ్మద్‌ను కాల్చిచంపినందుకు ప్రతీకారంగా భారత్‌పై దాడి చేస్తామని అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. భారత ఉపఖండంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అల్ ఖైదా రంజాన్‌పై సందేశం ఇచ్చింది. అందులో అతిక్ మహ్మద్, అతని సోదరుడు అర్షబ్ మహ్మద్‌ను అమరవీరులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మారణకాండకు ప్రతీకారం తీర్చుకుంటామని, ముస్లింలను విడిపించుకుంటామని 7 పేజీల లేఖను విడుదల చేసింది.