ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై దాడి చేస్తామంటూ వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. ఈ నెల 24న కేరళలోని కొచ్చిలో ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేరళలోని బీజేపీ హెడ్క్వార్టర్స్కి ఆత్మాహుతి దాడి చేస్తామంటూ వచ్చిన లేఖలో బెదిరించారు. దీంతో కేరళలో హైఅలర్ట్ ప్రకటించి భద్రత కట్టుదిట్టం చేశారు. సెక్యూరిటీ డ్రిల్స్ కు సంబంధించి ఏడీజీపీ జారీ చేసిన లెటర్ లీక్ కావడం.. తీవ్రమైన భద్రత లోపమని నాయకులు విమర్శించారు.