ద్రోణి ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. పిడుగులు పడే ప్రమాదముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు కూడా రాయలసీమ, కోస్తాంధ్రలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మరోవైపు అనకాపల్లి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో పలు చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.