కెన్యాకు చెందిన ఓ పాస్టర్ స్థలంలో 39 మృతదేహాలు లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. మృత్యువు దరిచేరే వరకు ఉపవాసం ఉండాలని పాల్ మెకెంజీ అనే పాస్టర్ తన అనుచరులకు సూచించాడు. ఉపవాసం ఉంటూ అత్యంత నీరస స్థితికి చేరుకున్న భక్తులు అలానే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పాస్టర్ ఇల్లు, పొలాల్లో తనిఖీలు చేసిన పోలీసులు 39 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితికి చేరుకున్నట్లు గుర్తించారు.