UPలోని అయోధ్యలో ప్రపంచ వ్యాప్తంగా 155 దేశాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో శ్రీ రాముడికి జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నారైలు, రాయబారులు పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్, చైనా, పాకిస్థాన్ నుంచి సైతం పవిత్ర జలాన్ని తీసుకొచ్చారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పవిత్ర జలాన్ని సేకరించడానికి రెండున్నరేళ్లకు పైగా పట్టింది. ఈ కార్యక్రమం ఎంతో ఉద్వేగభరితమైన ఘట్టం అని మత పెద్దలు కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa