‘ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం. మలిదశ ఉద్యమం చాలా ఓర్పుతో, సహనంతో సాగుతోంది. న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం ఉద్యోగులు పోరాడుతున్నారు. భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరమైతే మా బాధ్యత కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం’ అని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి స్పష్టం చేశామన్నారు. సోమవారం సచివాలయంలో సీఎ్‌సతో భేటీ అయిన అనంతరం ఆ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలను మరోమారు సీఎ్‌సకు తెలియజేశాం. డిమాండ్లపై చర్చించి ఆమోదయోగ్యమైనవి ఆమోదించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నాం. రెండుసార్లు మంత్రివర్గ ఉప సంఘం సమావేశాలు ఏర్పాటు చేసినా సమస్యలు పరిష్కారంకాలేదు.