ఉపాధ్యాయులపై ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యలు, అకారణ సస్పెన్ష్లకు వ్యతిరేకంగా మంగళవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యా సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) చేపట్టబోయే నిరసనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, ఆస్కార్‌రావు సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీజీఈఏ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో ఫ్యాప్టోను సంప్రదించి వారి కార్యాచరణలో పాల్గొంటాయని తెలిపారు. అలాగే, ఏపీజీఈఏ నాయకత్వం ఫ్యాప్టో రాష్ట్ర ప్రతినిధులతో కలిసి కార్యాచరణలో పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పెంచేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల చర్యలు ఉండడం, అకారణంగా సస్పెండ్ చెయ్యడం చాలా బాఽధాకరమన్నారు.