అమరావతిలో ఫ్లెక్సీల రగడ మొదలైనది. టీడీపీ, వైసీపీల ఫ్లెక్సీలను పంచాయతీ అధికారులు తొలగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన వ్యతిరేకిస్తూ వైసీపీ కట్టిన ఫ్లెక్సీలను తొలగించారు. వైసీపీతో పాటు టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను పంచాయతీ సిబ్బంది తొలగించింది. చంద్రబాబుకు పర్యటన సందర్భంగా భారీ ఎత్తున టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ప్రధాన రహదారిపై ఉన్న ఫ్లెక్సీలన్నింటినీ తొలగించింది. పంచాయతీ సిబ్బంది సహకారంతో అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఈ ఫ్లెక్సీలను తొలగించారు.