తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దిష్టిబొమ్మలను సోమవారం వైకాపా నాయకులు దగ్ధం చేయడాన్ని ఖండిస్తూ పలమనేరు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశారు. పార్టీ కార్యాలయము నుంచి అంబేద్కర్ సర్కిల్ కు శాంతియుతంగా ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలియజేసేందుకు నాయకులు పూనుకున్నారు. అయితే అధికార పార్టీ నేతల దిష్టి బొమ్మలు తగలబెడుతారన్న విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలియజేసేందుకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు అనుమతించాలని నాయకులు కోరినా పోలీసులు నిరాకరించడంతో నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయం వద్ద పోలీసు వలయాన్ని చేదింకొని అంబేద్కర్ సర్కిల్ కు చేరుకున్నారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు గ్యాస్ నాగరాజు, పలమనేరు పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు, గంగవరం మండల ఎస్సీ సెల్ నాయకులు రవి, రెడ్డెప్ప తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్బీసి కుట్టి, సుబ్రమణ్యం గౌడ్, ఖాజాపీర్, మదన్, చిన్ని, నారాయణ, గిరిధర్ గోపాల్, లోకేష్, రాజేష్, శ్రీనివాసులు, మండల నాయకులు నాగరాజు రెడ్డి, గణేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.