రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉక్కపోత, ఎండ తీవ్రత కొనసాగాయి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అనంతపురంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వాడ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.