పేదరిక సంకెళ్లను తెంచుకోవాలంటే అది చదువనే అస్త్రంతోనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు మంచి చేస్తూ.. దాదాపు 8 లక్షలమంది తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ. 912 కోట్ల రూపాయలను నేరుగా జమ చేస్తున్నామని చెప్పారు. చదువు ఓ కుటుంబ చరిత్రనే కాదు.. ఓ సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుంది. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే మా తాపత్రయం. ఈ నాలుగేళ్లలో నాణ్యమైన విద్య అందించే విధంగా.. విద్యా రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు.. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు రూ. 20 వేలు అందిస్తున్నాం. ఇది జగనన్న విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న జగనన్న వసతి దీవెన అని సీఎం జగన్ పేర్కొన్నారు. పీజు రీయంబర్స్‌మెంట్ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడాలు ప్రజలు గమనించాలని సీఎం వైయస్ జగన్ ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు.