ఉత్తరప్రదేశ్‌లో నవ వధువుపై పుట్టింటివారే దారుణానికి పాల్పడ్డారు. బరేలీకి చెందిన యువతికి ఇటీవల వివాహమైంది. అయితే పెళ్లి అయ్యాక అత్తవారింట్లోనూ ఆమె తన ప్రేమికుడితో మాట్లాడుతోందని తెలుసుకొన్న యువతి కుటుంబికులు పుట్టింటికి తీసుకెళ్లారు. తండ్రి, సోదరుడు, ఇతర బంధువులంతా కలిసి యువతిపై యాసిడ్ పోసి అటవీ ప్రాతంలో పడేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతిని ఆస్పత్రికి తరలించారు.