ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి సీఎం జగన్మో హన్‌రెడ్డి పరిపాలన చేయటం సిగ్గుచేటని రాజధాని అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహి ళలు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి- సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట రాజధాని గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న నిరసనలు శుక్రవారం నాటికి 1228వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విశాఖకు రాజధాని అని ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వ ఆస్తులను దోచుకోవటానికి సీఎం పన్నాగం పన్నార న్నారు. మూడు రాజధానుల ప్రకటనతో రాజధానిలో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోవ టంతో వేలాదిమంది కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారన్నారు. వేలకోట్ల రూపా యలతో నిర్మించిన భవనాలు శిధిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు. కేంద్రంలో అధి కారం చేపట్టిన బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని చెప్పి దానికీ ఏగనామం పెట్టిందన్నారు. అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేస్తే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. రాజధానిలో 29 గ్రామాలైన తుళ్లూరు, వెలగపూడి, ఉద్దండ్రాయునిపాలెం, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో దీక్షలు కొనసాగాయి.