అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామానికి చెందిన గొల్ల మౌనిక (17) అనే విద్యార్థిని ఇంటర్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్ళితే....... మౌనిక 2022లో మొదటి సంవత్సరం 375 మార్కులతో ఉత్తీరత సాధించింది. ద్వితీయ సంవత్సరం రెండు సబెక్టులలో ఫెయిల్ అయింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కూల్ డ్రింక్‌లో విషపు గుళికలు కలుపుకుని తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు గమనించి శుక్రవారం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.