అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణంలోని ఓం శాంతి నగర్లో గురువారం రాత్రి కొందరు గొడవ పడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మహబూబ్ బాషా అనే యువకుడు విడిపించేందుకు వెళ్లాడు. అదే సమయంలో వచ్చిన పోలీసులు.. గొడవ పడుతున్నవారితోపాటు మహబూబ్ బాషాను కూడా స్టేషనకు తీసుకువెళ్లారు. తాను విడిపించేందుకు వెళ్లానని, గొడవతో తనకు సంబంధం లేదని చెప్పినా ఎస్ఐ వినిపించుకోలేదని వాపోయాడు. కాళ్లు, చేతులు వాచేలా ఎస్ఐ లాఠీతో కొట్టాడని, ఆ తరువాత వదిలిపెట్టాడని తెలిపాడు. తీవ్రంగా గాయపడిన బాధితున్ని కుటుంబ సభ్యులు చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.