సీఎం జగన్ బటన నొక్కుడు తప్ప రాష్ట్రంలోని కార్మికులకు చేసిందేమీ లేదని హిందూపురం పార్లమెంట్ టీఎనటీయూసీ అధ్యక్షుడు తాడాల నాగభూషణం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతారని ఎంతో ఎదురుచూశారన్నారు. ఉమ్మడి జిల్లాకు పరిశ్రమల ఏర్పాటు, కార్మికులకు ఎలాంటి హామీలు లేకుండానే కార్యక్రమం ముగిసిపోయిందన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించు కుని మే 1న విశాఖపట్నంలో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగం హలో కార్మిక..చలో విశాఖ కార్యక్రమాన్ని జయపద్రం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎనటీయూసీ అధికార ప్రతినిధి రవీంద్రనాయుడు, మండల అధ్యక్షుడు రాంబాబు, సుబ్బు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.