అనంతపురం జిల్లా, రామగిరి సర్కిల్ కార్యాలయంతోపాటు చెన్నేకొత్తపల్లి, రామగిరి పోలీ్సస్టేషనలను శుక్రవారం రాత్రి అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన అమ్మిరెడ్డి తనిఖీచేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలను సీఐ చిన్నగౌ్సను అడిగితెలుసుకున్నారు. ఆయా పోలీస్ స్టేషనలోని గదులు, లాకప్, ఉమెనహెల్ప్డె్స్క, పోలీ్సస్టేషన పరిసరాలను, సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. రామగిరి పోలీ్సస్టేషన పరిధిలోని పేరూరు, అప్పర్పెన్నార్ ప్రాజెక్టు, బంగారు గనులు గురించి ఎస్ఐ జనార్దననాయుడును అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అంతర్రాష్ట్ర చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. గ్రామానికి కేటాయించబడిన పోలీసు, మహిళా పోలీసులు సమన్వయంగా ఉంటూ శాంతిభద్రతల పర్యవేక్షణ చేపట్టే విధంగా చూడాలన్నారు.