శుక్రవారం అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాక్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో యశ్వంత్ అంబేడ్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... అంబేడ్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. విస్తృత మానవ ప్రయోజనాల కోసం అంబేడ్కర్ అవలంబించిన ఆలోచనలు, విధానాలు, సిద్ధాంతాలు నేటి సమాజానికి ఎప్పటికీ దిశా నిర్దేశం చేస్తునే ఉంటాయని పునరుద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కొందరి వాడు కాదని, అందరివాడని ఆయన అన్నారు.