ఇంటర్మీడియట్ కోర్సులకు 2023-24 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ విద్యామండలి విడుదల చేసింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ రెండు సంవత్సరాల విద్యార్థులకు జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మొత్తం పనిదినాలు 227. ఫిబ్రవరి రెండో వారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో ఽథియరీ పరీక్షలు, మార్చి 28 విద్యా సంవత్సరానికి చివరి పనిదినం. కాలేజీలకు మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని, విద్యా సంవత్సరంలో ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు మినహా 75 సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.