తిరువూరు నియోజకవర్గ గంపలగూడెం-నూజివీడు ఆర్అండ్బి ప్రధాన రహదారిపై పడవేసిన జంగిల్తో వాహనదారులకు ప్రమాదం నెలకొంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలోని వినగడప శివారు పేరంటాళ్ళ గుట్ట నుంచి నార్కింపాడు వరకు రహదారి ఇరువైపులా కాల్వలో, మార్జిన్లో జంగిల్ తొలగింపు పనులను కూలీలతో చేపట్టారు. తొలగించిన జంగిల్ ను తారు రోడ్డుపై ఇరువైపులా పడవేశారు. అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. పలు మలుపుల వద్ద జంగిల్ రహదారి పైన సగం వరకు వ్యాపించడంతో పలువురు రాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని జంగిల్ను రహదారిపై నుంచి తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.