చాలా ప్రతిష్టాత్మకంగా మే 9న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. దీనికోసం 1902 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని సీఎం అన్నారు. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం. ఇండివిడ్యువల్ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం. హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే.. దాని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని సీఎం అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం, నాడు-నేడుపై సీఎం సమీక్షించారు.