విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద రాస్తారోకో కు అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తాడేపల్లిలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి బూరగ వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు వేముల దుర్గారావు లను తాడేపల్లి పోలీసులు బుధవారం ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టులుతో ఉధ్యమాలను ఆపలేరని నాయకులు ఈసందర్బంగా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa