ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, పరిధిలోని తణుకు రూరల్, ఇరగవరం, ఉండ్రాజవరం పోలీసు స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడు తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌పి రవిప్రకాశ్ చెప్పారు. రూరల్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన పాలాడి భానుప్రకాష్, తణుకు మండలం వేల్పూరుకు చెందిన తణుకు వెంకటేష్, అదే గ్రామానికి చెందిన తణుకు సాయిబాబాలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను పగలు రెక్కి చేసి, రాత్రి సమయంలో తాళం బద్దలు కొట్టి విలువైన వస్తువులు దొంగలి స్తారన్నారు. మండపాక ఆకుల బోర్డ్సు ఫ్యాక్టరీ దగ్గరలో వీరిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితుల నుంచి 155.52 గ్రాముల బంగారు ఆభరణా లు, 1770.73 గ్రాముల వెండి వస్తువులు, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిల్‌ను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. సిబ్బందికి ఎస్‌పి రివార్డులు అందించారు. డీఎస్పీ మనోహరాచారి, సీఐ సిహెచ్.ఆంజనేయులు, ఎస్‌ఐ కె.గుర్రయ్య, పీసీలు ఎస్‌కె అక్బర్, అన్వర్, అరుణకుమార్, కృష్ణంరాజు, మాదవరావు, అప్పారావు పాల్గొన్నారు.