పెడన పట్టణంలోని రామలక్ష్మీ వీవర్స్ కాలనీలో మహిళపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. కలంకారీ పనులు చేసుకునే మోకా లక్ష్మీ కరుణకుమారి (40) భర్త, ఇద్దరు కుమార్తెలతో కలసి రామలక్ష్మీ వీవర్స్ కాలనీలో నివసిస్తోంది. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో బాత్రూమ్లోకి వెళ్లి వస్తున్న లక్ష్మీ కరుణకుమారిపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ పోసి పారిపోయాడు. యాసిడ్ దాడితో ఆమె ముఖంపై కాలిన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై రవిచంద్రకుమార్ సిబ్బందితో రామలక్ష్మీ వీవర్స్ కాలనీలోని ఆమె ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆమె కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీకరుణకుమారిని 108 అంబులెన్స్‌లో బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇమ్మానియేలు పాల్గొన్నారు.