పలాస రైల్వే పోలీస్టేషన్ పరిధి పూండి-నౌపడా రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తిమృతి చెందినట్లు హెచ్సీ కోదండరావు తెలిపారు. రైల్వేట్రాక్ పక్కన మృతదేహాన్ని గుర్తించామన్నారు. సుమా రు 40 ఏళ్ల వయసుంటుందని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభు త్వ ఆసుపత్రికి తరలించామన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు.