ఇటీవల గుంటూరు నగరంలో నూతనంగా బస్తీల పేర్లను తెలుపుతూ ఏర్పాటు చేసిన బోర్డులలో ఏటి అగ్రహారం బస్తీ పేరును ఫాతిమా నగర్ గా మార్చడంపై గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు గురువారం గుంటూరు కమిషనర్ కార్యాలయంలో ఏటి అగ్రహారం పేరుని యధాతధంగా కొనసాగించాలని ఫాతిమా నగర్ పేరు మీద పెట్టిన బోర్డుని వెంటనే అక్కడి నుండి తీసేయాలని డిప్యూటీ సిటీ ప్లానర్ కోటయ్యకు వినతిపత్రం అందజేశారు. పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఏటి అగ్రహారం పేరుని ఫాతిమా వార్డుగా మారిస్తే చూస్తూ ఊరుకోమని, వెంటనే బోర్డ్ ని అక్కడ నుండి తొలగించాలని లేనిపక్షంలో ఏటి అగ్రహారం లో ఉన్న స్థానికులతో నగరపాలక సంస్థ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల రామకృష్ణ తో పాటు వనమా నరేంద్ర, ఈదర్ శ్రీనివాస్ రెడ్డి, కొక్కెర శ్రీనివాస్ యాదవ్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.