ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఇరిగేషన్ శాఖలో రూ.100కోట్ల అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ఒక్క సర్వేపల్లే కాదు.. జిల్లా వ్యాప్తంగా గ్రావెల్, మట్టి, ఇసుక దోపీడీ ఎక్కువైందన్నారు. ఉండేది 5 రీచ్‌లు అయితే అవికాకుండా ఎక్కడంటే అక్కడ తవ్వకాలు చేసి దోచేస్తుంటే కలెక్టర్, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇరిగేషన్‌లో తవ్వకాలపై సమాచారం హక్కు చట్టం కింద కోరితే ఇవ్వడం లేదన్నారు. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ అయినా దీనిపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలోనూ వైసీపీ విచ్చలవిడిగా దోచేస్తుందన్నారు. ఇక్కడ రిటైల్ అయితే...అక్కడ హోల్‌సేల్ అన్నారు. వచ్చేది టీడీపి ప్రభుత్వమని, ప్రతిదానిపై విచారణ చేయించి, వడ్డీతో సహా వసూలు చేసి ప్రజలకు దక్కేలా చూస్తామన్నారు.