ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు జనసేన అండగా నిలుస్తుందని జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ అన్నారు. ఫీజులు చెల్లించి, బయటకు వెళ్లాలని యాజమాన్యం విడుదల చేసిన ఆదేశాలతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని అన్నారు. ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాల్సిన విద్యార్థుల భవిష్యత్‌ను యాజమాన్యం ప్రశ్నార్ధకంగా మారుస్తోందని ఆయన విమర్శించారు. ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణతో కలిసి ట్రిపుల్‌ఐటీ యాజమాన్య సభ్యులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూన్ 5వరకు ఫీజులు చెల్లింపునకు యాజమాన్యం గడువు ఇచ్చిందని వారు తెలిపారు. నూజివీడు మండల అధ్యక్షులు యర్రంశెట్టి రాము, ఉపాధ్యక్షులు యింటూరి చంటి తదితరులు పాల్గొన్నారు.