నాడు-నేడుపనులను జూన్ 10 లోపు పూర్తిచేయాలని ఇందుకు ప్రణాళిక బద్ధంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ నాడు- నేడు పనుల పురోగతిలో పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడుకార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్నదని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు ప్రణాళికబద్ధంగా పనిచేసే పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa